విశాఖలో అప్రమత్తమైన అధికారులు
విశాఖలో అప్రమత్తమైన అధికారులు

విశాఖపట్నం: విశాఖ నగరంలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో అతని నివాస ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లతో 114 బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో తిరుపతిరావు తెలిపారు.
మొత్తం 7,800 గృహాలను జల్లెడపడుతున్నట్లు చెప్పారు. స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామని వెల్లడించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో కోరారు.