318 మందికి బంగారు పతకాలు
స్నాతకోత్సవ నిర్వహణపై ఏయూ పాలకమండలి సమావేశంఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో 318 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, బహుమతులను అందివ్వనున్నారు. వీరితోపాటు 225 మంది పరిశోధక విద్యార్థులకు పిహెచ్డీ, 9 మందికి ఎంఫిల్ పట్టా, 150 మంది పీజీ విద్యార్థులకు ప్రొవిజనల్ ధ్రువీకరణ పత్రాలను అందివ్వనున్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి మే 31న జరగనున్న ఏయూ స్నాతకోత్సవ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పాలక మండలి సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా స్నాతకోత్సవ నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. వివిధ రంగాలలోని ప్రముఖులు, క్రీడాకారులు, సంగీతం, సాహిత్యం, నాట్య రంగాల్లోని విద్వాంసులకు అందించే కళా ప్రపూర్ణ, క్రీడా ప్రపూర్ణ బిరుదులను ప్రస్తుత స్నాతకోత్సవంలో నలుగురికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు. గవర్నర్ ఆమోద ముద్ర వేశాక వీరి పేర్లను బహిర్గతం చేస్తారు. ఈ ఏడాది క్రికెట్ క్రీడాకారుడు లక్ష్మణ్, సాహితీ వేత్త చంద్రబోస్, సంగీత దర్శకులు ఇళయరాజా, గాయని, నటి రావు బాల సరస్వతి వంటి ప్రముఖులతోపాటు మరి కొందరి పేర్లను అవార్డుల కోసం ప్రతిపాదించినట్లుగా విశ్వసనీయ సమాచారం. గవర్నర్ ఆమోదంతోపాటు అవార్డు గ్రాతల అంగీకారం అనంతరమే అధికారులు అధికారికంగా పేర్లను వెల్లడించనున్నారు. గత ఏడాది బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు క్రీడా ప్రపూర్ణ ప్రదానం చేయాలని ఏయూ యోచించినా వీలు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జాగ్రత్తలు వహించారు. గౌరవ డాక్టరేట్‌ను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవాన్ని సాంప్రదాయ బద్ధంగా ఏయూ స్నాతకోత్సవ మందిరంలో కాకుండా కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించనుండడం పట్ల పాలకమండలి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరారవు, రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399