రైల్వే పరిసరాల్లో 3.75 లక్షలు నాటుతాం!

రైల్వే పరిసరాల్లో 3.75 లక్షలు నాటుతాం!
డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్
రైల్వే పరసరాల్లో మొక్కలు నాటి నీరు పోస్తున్న డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్‌కుమార్ శ్రీవాస్తవ్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకోవాని వాల్తేర్ రైల్వే ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
డీఆర్ఎం శ్రీవాస్తవ్ మాట్లాడుతూ 2018-19 సంవత్సరంలో వాల్తేర్ రైల్వే కాలనీలు, ప్రహారీలలో దాదాపు 1,44,400 మొక్కలు నాటామని, 2019-20లో మరో 3.75 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
డివిజన్లో కోచ్ కేర్ సెంటర్ వద్ద, బూట్ లాండ్రీ వద్ద వ్యర్థ జలాల పునర్వినియోగ ప్లాంట్లు ఏర్పాటుచేశామన్నారు. డివిజన్లోని పలు స్టేషన్లు, నివాస సముదాయాలు, కార్యాలయాల్లో సోలార్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు.
పచ్చదనంపై అవగాహన కలిగించేందుకు ఏడీఆర్ఆర్ఎంలు రామచంద్రరావు, అక్షయ సక్సేనా, ఇతర అధికారులు, స్కౌట్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్ ఇతర సిబ్బందితో కలిసి రైల్వే కాలనీల్లో ర్యాలీలు నిర్వహించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి పలువురు సిబ్బంది ప్రదర్శించిన వీధి నాటకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేందర్ శ్రీవాస్తవ్‌తో పాటు పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.