News

Realestate News

బాబు భరోసా డీజిల్‌, పెట్రోలుపై రూ.2 తగ్గించిన ముఖ్యమంత్రి

బాబు భరోసా!

డీజిల్‌, పెట్రోలుపై రూ.2 తగ్గించిన ముఖ్యమంత్రి
వాహనదారులపై రోజుకు తగ్గనున్న భారం రూ.84 లక్షలు
కేంద్రం కూడా ఆలోచించాలంటున్న వాహనదారులు

బాబు భరోసా డీజిల్‌, పెట్రోలుపై రూ.2 తగ్గించిన ముఖ్యమంత్రి పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళ్లెం వేశారు.  శతకం దిశగా పరుగులు పెడుతున్న ఇంధన ధరలను అదుపుచేయడం కోసం వ్యాట్‌లో రూ.2 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. మంగళవారం నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వస్తాయన్నారు. గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరగడమే తప్ప తగ్గడం తెలియని వాహనదారులకు ముఖ్యమంత్రి ప్రకటనతో తీపికబురు అందినట్లయింది.

గత పక్షం రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ.3.50 పెరగగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన ధరలో రూ.2 తగ్గనుంది. ఈ మేరకు జిల్లాలో సగటు వినియోగంపై రూ.లక్షల్లో ఊరట కలుగుతుంది. సోమవారం లీటరు పెట్రోలు రూ.86.28, డీజిల్‌ రూ.79.56 పలికింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వ్యాట్‌ తగ్గించడంతో మంగళవారం పెట్రోలు రూ.84.28, డీజిల్‌ రూ.77.56 ధరకు తగ్గనున్నాయి. జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 13.85 లక్షలున్నట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి రోజూ జిల్లాలో 23 లక్షల లీటర్ల డీజిల్‌, 14 లక్షల లీటర్ల..  పెట్రోలు అమ్మకాలు జరుగుతున్నట్లు పెట్రోలు బంకుల నిర్వాహకుల సంఘం చెబుతోంది. సోమవారం ధర ప్రకారం చూస్తే ఒక్క పెట్రోలు కొనుగోలుకే వాహనదారులు సుమారు రూ.12.07 కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.2 తగ్గించిన తరువాత సుమారు రూ.28 లక్షల మేర వినియోగదారులకు ఊరట కలుగుతుంది. అలాగే డీజిల్‌పై రూ.79.56 చొప్పున రోజువారీ జిల్లాలో వాహనదారులు రూ.18.29 కోట్లు ఖర్చుచేస్తున్నారు. రాష్ట్ర సర్కారు చొరవతో లీటర్‌పై రూ.2 తగ్గడంతో డీజిల్‌ వాహనచోదకులపై రూ.56 లక్షల భారం తగ్గనుంది. మొత్తంగా పెట్రోలు, డీజిల్‌పై జిల్లాలో రూ.84 లక్షల మేర ఊరట కలగనుందని సంబంధిత రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేంద్రం ఆలోచించాలి..
సామాన్యులకు ఊరటనిచ్చేలా పెట్రో ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల వారు స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవను అందరూ మెచ్చుకున్నారు. ఆయన మాదిరిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించి ఇంధన ధరలు తగ్గించాలని కోరుతున్నారు. అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయని, రూపాయి మారకం విలువ తగ్గతుందనే సాకుతో రోజూ ఇంధన ధరలను పెంచేస్తూ.. సామాన్యుల బతుకు చిధ్రం చేస్తున్నారని జిల్లా సీపీఎం కార్యదర్శి లోకనాథం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కేంద్రం కూడా పెట్రోలు, డీజిల్‌పై ధరలను తగ్గించాలన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo