News

Realestate News

గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం

గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం

గొడుకొమ్ము(జామి) న్యూస్‌టుడే: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం తెలిపారు. మండలంలోని గొడుకొమ్ము గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ఎమ్మెల్యే నిధులతో నిర్మించి సీసీ రహదారులను జిల్లాపరిషత్‌ మాజీ అధ్యక్షుడు లగుడు సింహాద్రి, ఎంపీపీ పి.అప్పయ్యమ్మతో కలిసి ప్రాంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెటులో ఉన్నా…ముఖ్యమంత్రి తన తెలివితేటలతో గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించామని, ఈ రోడ్డు నిర్మాణానికి కేవలం తన కోటా నిధులే ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా కింద నిర్మించిన ఇళ్లను ఆమె చేతులమీదగా ప్రారంభించారు. ఎంపీడీవో జి.శ్రీనువాసరావు గొడుకొమ్ము సర్పంచి బొబ్బిలి శ్రీదేవి, గ్రామ పెద్దలు బొబ్బిలి గోవింద, మండల ఎ.ఇ.నాయుడు, గృహనిర్మాణ శాఖ కొత్తవలస డి.ఇ. గౌరీశంకర్‌, ఎ.ఇ. చిన్నబాబు మండల తెదేపా నాయకుడు రెడ్డి పైడిబాబు, ఎంపీటీసీ సభ్యుడు కడియాల గోపి గ్రామస్థులు పాల్గొన్నారు.