News

Realestate News

ఉద్యోగోన్నతుల్లో అన్యాయాన్ని సహించం

‘ఉద్యోగోన్నతుల్లో అన్యాయాన్ని సహించం’
విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: వాణిజ్యపన్నుల శాఖ విజయనగరం డివిజన్‌ పరిధిలోని డైరెక్ట్‌ రిక్రూటీ(డీఆర్‌) జూనియర్‌ సహాయకులు బుధవారం భోజన విరామ సమయంలో ఉద్యోగోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతోందని ధర్నా చేశారు. న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. జూనియర్‌ సహాయకుల ప్రతినిధులు వి.వంశీకృష్ణ, ఎ.రాజేశ్వరి, ఆర్‌.వేణుగోపాల్‌, సిహెచ్‌ బాలకృష్ణ, డి.శ్రీనివాసరావు, కె.ప్రవళ్లికలు మాట్లాడుతూ ఈ శాఖలో సర్వీసు, సీనియార్టీ నిబంధనలను అమలు చేయకపోవడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు గండిపడ్డాయన్నారు. ఈ డివిజన్‌  ఏర్పడినప్పటి  నుంచి జూ.స.ల ఉద్యోగాలకు రోటా-కోటాను అమలు చేయలేదన్నారు.  తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు.అనంతరం అదనపు కమిషనరు ఎన్‌.శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. టి.ఈశ్వరరావు, కె.ప్రకాష్‌, టి.నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo