అర్హులందరికీ ప్రభుత్వ గృహాలు మంత్రి గంటా శ్రీనివాసరావు
ఏయూప్రాంగణం, న్యూస్‌టుడే : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ గృహం మంజూరు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు హుద్‌హుద్ తుపాను అనంతరం 4,750 గృహాలు మంజూరయ్యాయన్నారు. అందులో భీమిలి నియోజకవర్గానికి 520 మంజూరు కాగా, శుక్రవారం 216 లబ్ధిదారులకు డ్రా తీసి గృహాలను కేటాయించారు. మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే కేటాయింపు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎంవీపీకాలనీలోని మంత్రి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రానున్న రోజుల్లో భీమిలి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంత పరిధిలో 14 వేల గృహాలను నిర్మిస్తారని తెలిపారు.