News

Realestate News

రేపు ఉద్యోగమేళా

రేపు ఉద్యోగమేళా
రాజాం, న్యూస్‌టుడే: పవర్‌ గ్రిడ్‌ సహకారంతో ఇండో జర్మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న రాజాంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు సంస్థ సంచాలకుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఎమ్పీడీవో కార్యాలయం సమీపంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఐఐటీ ఉత్తీర్ణత సాధించిన 18-27 ఏళ్ల  యువకులు అర్హులని తెలిపారు. మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.