News

Realestate News

నగర విద్యార్థికి ప్రపంచ పురస్కారం

నగర విద్యార్థికి ప్రపంచ పురస్కారం
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మలేషియాలో ఈ నెల 13న జరిగిన కథల పోటీల్లో టింఫనీ పాఠశాల విద్యార్థి ఉప్పల వెంకటసాయిషణ్ముఖ్‌ జూనియర్‌ విభాగంలో ప్రపంచ కప్‌ టైటిల్‌ను సాధించాడు. లండన్‌ కేంద్రంగా ఉన్న బోటన్‌ అండ్‌ లాఫీ అంతర్జాతీయ సంస్థ మలేషియాలోని బికాన్‌ హౌస్‌ న్యూలాండ్స్‌ అంతర్జాతీయ పాఠశాలలో ఈ పోటీలను నిర్వహించింది. నగరంలోని టింఫనీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న షణ్ముఖ్‌ స్థానికంగా జరిగిన పోటీల్లో విజేతగా నిలవడంతో మలేషియాకు పంపారు. అక్కడ కూడా సత్తాచాటడంతో ప్రపంచ స్థాయి పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. షణ్ముఖ్‌ను పాఠశాల ప్రిన్సిపల్‌ వందన అబ్రహాం అభినందించారు.