News

Realestate News

పేదల ఆరోగ్యానికి సర్కారు పెద్దపీట

పేదల ఆరోగ్యానికి సర్కారు పెద్దపీట
ఆరోగ్య రథం ప్రారంభించిన మంత్రి కళా
బస్సులోనే ఆధునిక వైద్య సదుపాయాలు

రణస్థలం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యతనిస్తుందని ఇంధన శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని అల్లివలస గ్రామంలో ఏపీ ట్రాన్సుకో సామాజిక సేవా విభాగంలో భాగంగా రూ.45 లక్షలతో సమకూర్చిన ఆరోగ్య రథంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్సులో పూర్తి స్థాయి వైద్య సదుపాయాలుంటాయన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఇందులో చేసుకోవచ్చన్నారు. జిల్లాలో సీతంపేట, రణస్థలం ప్రాంతానికి ఒక్కొక్క బస్సు సమకూర్చడం జరిగిందన్నారు. నెల రోజులు పాటు తీరప్రాంతంలో వైద్య సేవలందిస్తుందని, మిగతా సమయంలో ఇతర గ్రామాలకు విడతల వారీగా వైద్య సేవలందిస్తుందన్నారు. తెదేపా ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలో పయనింప చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని విభజించి భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు మోసం చేశాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలూ కృషి చేస్తున్నారన్నారు. వృద్ధులకు పింఛన్లు, ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలెన్నో అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే మహిళలకు అత్యధిక బ్యాంకు లింకేజి కల్పించిన రాష్ట్రంగా ఉందన్నారు. వచ్చే జూన్‌ నాటికి నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. పింఛన్లు అర్హులందరికీ ఇస్తామన్నారు. తోటపల్లి నీరు ఇంకా 20 గ్రామాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నెల 22న విశాఖపట్నంలో లక్షమందితో ప్రత్యేక హాదాపై సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ఏదో చేస్తారని ఆశించామని, చివరకు మొండి చేయి చూపారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోటపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం జేఆర్‌పురంలో లక్ష్మీనగర్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్‌, గృహనిర్మాణ సంస్థ డైరెక్టరు ఎన్‌.ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు, లంక శ్యామలరావు, గొర్లె అసిరినాయుడు, మైలపల్లి వెంకటేష్‌, దుమ్ము పండోడు, ధనుంజయరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo