News

Realestate News

గ్రామీణ రహదారుల పనులకు ఆగస్టులో శ్రీకారం

గ్రామీణ రహదారుల పనులకు ఆగస్టులో శ్రీకారం
జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంయుక్త కార్యదర్శి ఆల్కా ఉపాధ్యాయ
విశాఖలో నాలుగు జిల్లాల సమావేశం
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌యోజన (పీఎంజిఎస్‌వై) 3వ దశలో భాగంగా దేశంలో లక్ష కిలోమీటర్ల రహదారుల పనులకు ఆగస్టులో శ్రీకారం చుట్టనున్నామని జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధి సంయుక్త కార్యదర్శి ఆల్కా ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రహదారుల నిర్మాణంతో పాటు ప్రధాన లింకు రహదారులు, గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. పీఎంజీఎస్‌వై ఫేజ్‌-1, ఫేజ్‌-2లలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంయుక్త కార్యదర్శి ఆల్కా బీచ్‌రోడ్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో శుక్రవారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎస్‌ఈలతోను సంయుక్త కార్యదర్శి ఆల్కా సమీక్షించారు. ఆల్కా మాట్లాడుతూ పీఎంజీఎస్‌వైలో రాష్ట్రంలో చేపడుతున్న పనులకు అటవీశాఖ అనుమతులు సత్వరమే జారీచేయాలని సంబంధిత అధికారులను ఆల్కా ఆదేశించారు. ఫేజ్‌-1లో 80 పనులకు 371 కిలోమీటర్ల రహదారులు మంజూరు చేశామన్నారు. వీటిలో కొన్ని పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ క్లియరెన్సులు అందాల్సిన 116 పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిలో విశాఖలో 93, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 6 పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటికి 2019 మార్చి 31లోగా టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు సహకారం తీసుకొని రహదారులు నిర్మించాలన్నారు. విశాఖ జిల్లాలో పీఎంజిఎస్‌వైలో 10 పనులు పూర్తవగా 53 రహదారులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 10 పనులకు అటవీ క్లియరెన్స్‌ రావాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌్ తెలిపారు. సమావేశంలో ఎన్‌ఆర్‌ఆర్‌డి సాంకేతిక డైరెక్టర్‌ పటేరియా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దుర్గాప్రసాద్‌, విజయనగరం, తూ.గో.జిల్లాల కలెక్టర్లు వివేక్‌యాదవ్‌, కార్తికేయమిశ్రా, విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, సిసిఎఫ్‌ రాహుల్‌పాండే, ఎపిఒ రవి పలువురు అధికారులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo