News

Realestate News

సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి 26 గడువు

26 for admission to universal schools.DVVS Devi, District Co-ordinator, said that admission to universal schools is due on August 26.


సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి 26 గడువు


గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న దేవి, తదితరులు

 సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి ఆగస్టు 26వ తేదీ గడువు అని జిల్లా కో-ఆర్డినేటర్‌ డీవీవీఎస్‌ దేవి తెలిపారు. బుధవారం సబ్బవరం వచ్చిన ఆమె స్థానిక మండల రిసోర్సు కార్యాలయంలో మాట్లాడారు.

డీఈవో ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు పని చేస్తాయన్నారు. ఏ విద్యార్హత లేకపోయినా 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు నేరుగా రాయవచ్చన్నారు. జిల్లాలో 77 కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.

సబ్బవరం మండలంలో 4ఎస్‌ డిగ్రీ కళాశాల, డీఎంకే జూనియర్‌ కళాశాల, ఎస్‌కేఎంఎల్‌ కళాశాలల్లో కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. 14ఏళ్లు నిండినవారు 10వ తరగతి, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయవచ్చన్నారు.

పదోతరగతి తరువాత ఒక సంవత్సరం ఖాళీగా ఉంటే ఇంటర్‌ రెండు సంవత్సరాల పరీక్షలు ఒకే సిట్టింగ్‌లో రాసుకోవచ్చునన్నారు. బాల్యంలో బడి మానేసినవారికి ఇది మంచి అవకాశమని తెలిపారు.

● 10వ తరగతికి రూ.1850, ఇంటర్‌కు రూ.2000 ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. ఎస్పీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, మైనారిటీలు, దివ్యాంగులకు ఇంటర్‌లో రూ.300 చొప్పున, 10వ తరగతిలో రూ.400 చొప్పున రాయితీ ఉంటుందన్నారు.

● 10వ తరగతికి పరీక్ష ఫీజుగా సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్‌ లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

అనంతరం ప్రవేశాల గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సబ్బవరం ఎంఈవో టి.మధుమూర్తి, ఉపాధ్యాయ ప్రతినిధి బీవీ రమణ, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ ఎం.మహేష్‌ పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo