26న బ్యాంకు ఉద్యోగుల ఒక రోజు సమ్మె
26న బ్యాంకు ఉద్యోగుల ఒక రోజు సమ్మె
దేశ ప్రజలకు, దేశ ఆర్థిక పురోగాభివృద్ధికి దోహదపడని బ్యాంక్ ఆఫ్ బరోడా,
విజయా బ్యాంక్ విలీన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక (తొమ్మిది యూనియన్లు) పిలుపు మేరకు ఈనెల 26న దేశవ్యాప్త
బ్యాంక్ ఉద్యోగుల ఒకరోజు సమ్మె చేయనున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఎఐబిఇఎ) జాతీయ కార్యదర్శి సీహెచ్
వెంకటాచలం తెలిపారు.
బుధవారం సాయంత్రం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో విశాఖపట్నం జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం సమావేశంలో ఆయన
మాట్లాడారు.
బ్యాంకుల మూసివేత, విలీనాల ప్రతిపాదనలు ప్రభుత్వం తక్షణమే విరమించాలని డిమాండ్ చేశారు.
భారతీయ స్టేట్ బ్యాంక్లో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం చేయడం వల్ల అనేక శాఖలు మూతపడటమే కాకుండా నిరర్థక ఆస్తులు పెరిగి
మొట్టమొదటిసారిగా నష్టాల్లోకి వచ్చిందన్నారు.
ఒకరోజు సమ్మెతో పాటు జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్తంగా సాధారణ సమ్మెలో పదికోట్ల మంది కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటారని
ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు వై.శ్రీనివాసరావు, ఆర్.వి. రవికుమార్,
ఎ.యుగంధర్, పి.ఆర్.ఎన్.ప్రసాదు, పి.మంగపతి తదితరులు పాల్గొన్నారు.