News

Realestate News

విశాఖ ఉత్సవ్‌’ గోడపత్రిక ఆవిష్కరణ

విశాఖ ఉత్సవ్‌’ గోడపత్రిక ఆవిష్కరణ

విశాఖపట్నం, న్యూస్‌టుడే(Navratri ‘innovation godapatrika): విశాఖ ఉత్సవ్‌ గోడపత్రికలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం విశాఖలో విడుదల చేశారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకూ ఆర్‌కే బీచ్‌ కేంద్రంగా విశాఖ ఉత్సవ్‌ జరగనుంది. నోవాటెల్‌ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు వచ్చారు.

ఈ-పరిపాలన సదస్సు నుంచి తిరుగుప్రయాణమయ్యే సమయంలో సీఎం ఉత్సవ్‌ గోడపత్రికలను విడుదలచేశారు. ఉత్సవ్‌ను విజయవంతంగా నిర్వహించాలని, అన్ని కార్యక్రమాలను పక్కాగా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వివిధ శాఖల చెందిన అధికారులు పాల్గొన్నారు.