News

Realestate News

తితిదే శ్రవణం ప్రాజెక్టుకు 2.57 ఎకరాల స్థలం కేటాయింపు

world wind utsav, visakhapatnamrealestate news

వేపగుంట :

వినికిడి లోపంతో బాధపడుతున్న పిల్లల కోసం తితిదే ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న శ్రవణం ప్రాజెక్టుకు స్థానిక శంకర్‌ ఫౌండేషన్‌ వెనుక ఉన్న 2.57 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు పెందుర్తి తహసీల్దారు పాండురంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం తితిదే, రెవెన్యూ సిబ్బంది స్థల సర్వే నిర్వహించారు. ఇప్పటికే తితిదే ఆధ్వర్యంలో శంకర్‌ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రిలో శ్రవణం ప్రాజెక్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్టుని మరింతగా విస్తరించడానికి తగిన వసతి అవసరమని తితిదే అధికారులు గుర్తించారు. ఆసుపత్రి పక్కనే ఉన్న రెండున్నర ఎకరాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని తితిదే కోరింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో స్థల హద్దులు కోసం రెండు శాఖల అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. హద్దులు పూర్తయిన వెంటనే ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తితిదే అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వినికిడి లోపంతో బాధపడే చిన్నారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని శంకర్‌ ఫౌండేషన్‌ యాజమాన్యం తెలిపింది.