News

Realestate News

2.32 లక్షల హెక్టార్లకు సాగునీరు

2.32 లక్షల హెక్టార్లకు సాగునీరు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) కింద ‘ప్రతీ సాగుభూమికీ నీరు’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2.32 లక్షల హెక్టార్లకు నీరు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సాగునీటి సరఫరా, లభ్యతపై సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖ ఎంపీ కె.హరిబాబు, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, జేసీ-2 డి.వి.రెడ్డి, ఆత్మ పథక సంచాలకులు వై.లక్ష్మణదాసు తదితరులు పాల్గొన్నారు. సాగు విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, జలాల పరిరక్షణ, ప్రణాళికాబద్ధంగా నీటి వనరులను వినియోగించుకోవడం తదితర అంశాలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన మీదట 2.32 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను రూపొందించామని, దీన్ని తుది ఆమోదానికి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఎంపీ కె.హరిబాబు మాట్లాడుతూ జిల్లాలో నీటి నిల్వసామర్థ్యం తక్కువగా ఉందని, దీన్ని పెంపొందించేందుకు చర్యలను చేపట్టాలన్నారు. కూరగాయల పెంపకం లాభసాటిగా ఉన్నందున రైతులకు అవగాహన కల్పించి, సాగు విస్తీర్ణానాన్ని పెంచాలన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ఉద్యాన పంటల విస్తీర్ణం 12 శాతం పెరిగిందన్నారు. అన్ని గ్రామాల్లోనూ దీన్ని ప్రోత్సహించాలన్నారు. స్ప్రింక్లర్లు వంటి సబ్సిడీతో కూడిన పరికరాలను రైతులకు అందించాలని కోరారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ తన నియోకవర్గ పరిధిలోని ఎస్‌.రాయవరంలో వరాహ నదికి వరద వస్తే పంటలు మునిగిపోతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కరకట్టలు నిర్మించాలని కోరారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo