News

Realestate News

16న ప్రధాని మోదీ రాక


16న ప్రధాని మోదీ రాక

16న-ప్రధాని-మోదీ-రాక

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 16న విశాఖ వస్తున్నారు.

ఆ మేరకు అధికారిక సమాచారం ఆ పార్టీలోని ముఖ్య నాయకులకు బుధవారం అందింది.

సభను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఆ పార్టీ ముఖ్యనాయకులు నిర్ణయించనున్నారు.

గతంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన కొన్ని ప్రారంభోత్సవాలు చేయాల్సి

ఉంది.

తాజా పర్యటనలో ఆయా కార్యక్రమాలు ఉంటాయా? లేవా?

అన్న సమాచారం పార్టీ నాయకుల వద్ద లేదు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించబోతున్న సభ కావడంతో ఇతర

కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని భాజపా శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది.

ఆ హామీని ప్రకటిస్తారా? అన్న చర్చ పార్టీలో నడుస్తోంది.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి 1న విశాఖ వచ్చి ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై

సమీక్షించనున్నారు.

సభను ఎక్కడ నిర్వహించాలన్నదానిపై పార్టీ పెద్దలు,

ముఖ్యలు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని భాజపా నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర ‘ఈనాడు’కు వెల్లడించారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo