News

Realestate News

149మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి


149మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

149మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

గ్రామీణ జిల్లా పరిధిలోని 149 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.

డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సూచనల మేరకు వీరందరికీ సీనియారిటీ ప్రాతిపదికన ఎస్పీ అట్టాడ బాబూజీ పదోన్నతి ఉత్తర్వులను ఆదివారం అందజేశారు.

వాస్తవానికి 210 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించాల్సి ఉంది.

ఈ మేరకు వారందరికీ విజయనగరం పోలీసు శిక్షణా కళాశాలలో 21 రోజుల పాటు గతనెలలోనే ప్రి ప్రమోషనల్‌ శిక్షణలు కూడా ఇచ్చేశారు.

అయితే ఆఖరి నిమిషంలో మహిళా కానిస్టేబుళ్ల సీనియార్టీ సమస్య కారణంగా ఇప్పటి వరకు వీరికి పదోన్నతి ఉత్తర్వులను అందజేయలేదు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఉత్తర్వులు అందడం లేదనే ఆందోళనలో పోలీసులుండేవారు.

ఈ విషయమై ‘ఈనాడు’లో ఈనెల 3న ‘ఆఖరి నిమిషంలో స్టాప్‌’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు.

కానిస్టేబుళ్ల పదోన్నతుల వ్యవహారాన్ని కొలిక్కితెచ్చారు.

ముందుగా 149 మందికి హెచ్‌సీలుగా ఉన్నతి కల్పించారు. మిగతావారికి దశల వారీగా పదోన్నతి కల్పించనున్నారు.

చొరవచూపిన ఎస్పీకి పోలీసు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo