News

Realestate News

క్రీడల రాజధానిగా విశాఖ

0001

క్రీడల రాజధానిగా విశాఖ
మంత్రి గంటాశ్రీనివాసరావు
జీవీఎంసీ వేసవి క్రీడా శిబిరాలు ప్రారంభం
విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: క్రీడల రాజధానిగా విశాఖను తీర్చిదిద్దనున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో జీవీఎంసీ ఏర్పాటు చేసిన వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో క్రీడలను తప్పనిసరి చేయనున్నామన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గతంలో జాతీయ క్రీడల నిర్వహణ విశాఖలో జరిగిందంటే అది సీఎం చంద్రబాబునాయుడు చలవే నన్నారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ నగరంలో స్టేడియంల ఏర్పాటు తక్షణావసరమన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ జీవీఎంసీ శిబిరాల్లో వందలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే క్రీడలపై వారికున్న ఆసక్తి ఎటువంటిదో అర్థ´ం చేసుకోవచ్చన్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. జీవీఎంసీ కమిషనరు ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రెండొందల కేంద్రాల్లో ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. అయిదు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. వీరందరికీ క్రీడా కిట్లు, ఆహారం అందజేస్తామన్నారు. జీవీఎంసీ క్రీడా సంచాలకులు వై.శ్రీనివాసరావు, ‘ద’ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు టి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌, ఎ.పి.వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం అధ్యక్షుడు కంచరాన సూర్యనారాయణ, అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షుడు డి.నాగేశ్వరరావు, పవర్‌లిఫ్టింగ్‌ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ఒలింపియన్‌ ఎం.వి.మాణిక్యాలు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Source : http://www.eenadu.net/

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo