13 నుంచి కళాభారతిలో జాతీయ ప్రతిభా పురస్కార కార్యక్రమం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే:
విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్సు అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 19 వరకు పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో జాతీయ ప్రతిభ పురస్కార అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సీఎస్ఎన్రాజు తెలిపారు. జాతీయ ప్రతిభా పురస్కార అవార్డులను 13 సంవత్సరాలుగా అందజేస్తున్నామని దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా 14వ సారి అవార్డుల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పద్మశ్రీపండిట్ అవార్డు గ్రహీత విశ్వమోహన్భట్కు నాదవిద్య భారతి, స్వర్ణకమలం, లక్ష రూపాయల నగదు అందజేసిÏ బిరుదు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెన్సార్‌బోర్డు విశ్రాంత ఛైర్మన్, జాతీయ సంగీత నాటక అకాడమీ విశ్రాంత ఛైర్మన్ లీలాశ్యామ్సన్లు హాజరు కానున్నట్లు తెలిపారు. అవార్డుతీసుకున్న అనంతరం మోహన్భట్చే వీణా కచేరి ఉంటుందన్నారు. సంస్థ కార్యదర్శి జీఆర్కే ప్రసాద్(రాంబాబు) మాట్లాడుతూ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వారంరోజుల్లో తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, ఆంధప్రదేశ్ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.