13 నుంచి ఇస్కాన్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
13 నుంచి ఇస్కాన్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

13న సాయంత్రం 4 గంటలకు శ్రీ కృష్ణనృత్యభారతి (సింహాచలం) శ్రీ కృష్ణ జన్మలీలలు నృత్యరూపకం
14న సాయంత్రం 4 గంటలకు సాయినాథ్ కళాసమితి శ్రీ కృష్ణదామోదరం నృత్యరూపకాలు
15న శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తెల్లవారుజామున 4.30 గంటలకు మంగళహారతి, 9 గంటలకు దర్శనహారతి, అఖండహరినామ సంకీర్తన, వూయలసేవ, ఉదయం 10 గంటలకు రంగోళీ, పుష్పాలంకరణ పోటీలు, సాయంత్రం 4.30 గంటలకు ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటాయి. విచిత్ర వేషధారణ, సోలో, గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు శ్రీ కృష్ణజన్మాష్టమిపై సందేహాల నివృత్తి, రాత్రి 11.30 గంటలకు లడ్డూ గోపాలునికి పుష్పాభిషేకం, అర్ధరాత్రి 12 గంటలకు వివిధ ద్రవ్యాలతో బాలకృష్ణుని ఉత్సవమూర్తికి అభిషేకం, 108 దీపాలతో దివ్య మంగళహారతి
16న ఉదయం 10 గంటలకు ఇస్కాన్ సంస్థాపక ఆచార్య ప్రభుపాదుల వారి జయంతి వేడుకలు