News

Realestate News

11న విమ్స్‌ ప్రారంభోత్సవం

11న విమ్స్‌ ప్రారంభోత్సవం
అదే రోజు ఈఎస్‌ఐ ఆసుపత్రికి శంకుస్థాపన
రానున్న సీఎం చంద్రబాబు,కేంద్రమంత్రులు
వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 11న విశాఖ రానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.సి.నడ్డా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా రానున్నారు. ఆ రోజు ఉదయం.. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో షీలానగర్‌ వద్ద కొత్తగా నిర్మించనున్న 300 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రికి సీఎం, కేంద్రమంత్రులు శంకుస్థాపన చేస్తారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి గాంధీగ్రామంలోని పోర్టు భవనంలో నడుస్తోంది. ఇది శిథిలమైపోయింది. అత్యాధునిక వసతులతో కొత్త ఆసుపత్రి భవనాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నిర్మిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం సమకూర్చింది. మొత్తం నిర్మాణ వ్యయం రూ. 500 కోట్లు. ఈ కార్యక్రమం అనంతరం విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్‌) ప్రాంభోత్సవ కార్యక్రమంలో

సీఎం, కేంద్రమంత్రులు పాల్గొంటారు. తొలిదశలో 50 పడకలతో సేవలను ప్రారంభిస్తున్నారు. పది విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలతోపాటు అత్యవసర సేవలను ఈ నెల 11 నుంచి అందించనున్నారు. ఓపీ విభాగాల నిర్వహణకు కేజీహెచ్‌ వైద్యులను పంపుతున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఏయూ స్నాతకోత్సవ మందిరంలో మహాత్మా జ్యోతిరావ్‌ పూలే 190వ జయంతి అధికారిక వేడుకల్లో వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం భారీఎత్తున బీసీ వర్గాలను సమీకరిస్తున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. సీఎం పాల్గొనబోయే వేదికలను కలెక్టర్‌ యువరాజ్‌ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటలకు సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ స్థలం పరిశీలించిన కలెక్టర్‌
అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: షీలానగర్‌ కృషి ఆసుపత్రి రోడ్డులో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని శుక్రవారం రాత్రి కలెక్టర్‌ యువరాజ్‌ పరిశీలించారు. డీఆర్‌డీఏ ప్రొజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, గాజువాక తహశీల్దార్‌ వేణుగోపాల్‌, సీఐ అప్పారావుతో ఏర్పాట్లపై మాట్లాడారు. శంకుస్థాపన తేదీ ఖరారయినా, ఇంకా సమయం ఖరారు కాలేదని అధికారులు తెలిపారు. శంకుస్థాపన అనంతరం ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తే అవసరమైన సౌకర్యాలపై అధికారులను కలెక్టర్‌ ఆరాతీశారు. ట్రాఫిక్‌, భద్రత, తదితర అంశాలపై సీఐకి సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం సాయంత్రానికి సమయం, సభ, తదితర పూర్తి వివరాలు ఖరారవుతాయని అధికారులు వివరించారు.

Source By:http://www.eenadu.net/

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo