News

Realestate News

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు

Elamancililo Rs. Crore development works

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు
తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చిన డీసీఐ
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కింగ్‌ జార్జి ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం త్వరలో ఈ-టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా వీటిని నాలుగు చోట్ల ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) ఈ-టాయిలెట్లను కేజీహెచ్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. కంటైనర్‌లో ఈ టాయిలెట్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కోదానిలో ఆరు యూనిట్లు వస్తాయి. అనువైన స్థలాలను కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున, ఆర్‌ఎంఓ డాక్టర్‌ బి.బంగారయ్య, జీవీఎంసీ ఇంజినీరు కృష్ణయ్య, డీసీఐ ప్రతినిధి బాలు మంగళవారం పరిశీలించారు. స్త్రీలు, పురుషులకు వేరువేరుగా ఏర్పాటు చేస్తారు.