News

Realestate News

సొంతింటి కలను నిజం చేసుకోండి

News Vizag

సొంతింటి కలను నిజం చేసుకోండి
నేటి నుంచి నోవాటెల్‌లో ‘ఈనాడు – ఎస్‌.బి.ఐ.’ ప్రోపర్టీ షో
ఎంవీపీకాలనీ, న్యూస్‌టుడే: ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరాల్లో విశాఖ ఒకటి. తీర ప్రాంతం, ప్రకృతి సోయగం, ప్రశాంత వాతావరణం ఈ నగరానికి ఉన్న ప్రత్యేకతలు. విద్య, వైద్య, పర్యాటక, పారిశ్రామిక కేంద్రాలుగా, ఆర్థిక నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కారణంగా మహా నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల్లో ఉద్యోగ రీత్యా ఉంటున్న అనేక కుటుంబాలు ఇప్పుడు విశాఖ వైపు చూస్తున్నాయి. ఫలితంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం క్రమంగా విస్తరిస్తోంది. స్థిరాస్తి సంస్థలు తమ వెంచర్లను సిద్ధం చేస్తున్నాయి.

అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలను జీవీఎంసీలో విలీనం చేయడంతో నగర విస్తీర్ణం 690 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఇపుడు శివారు ప్రాంతాలే కీలకంగా మారాయి. ఎండాడ, రుషికొండ, మధురవాడ, కొమ్మాది, ఆనందపురం, తగరపువలస, విజయనగరం వరకు కొత్తగా అనేక లేఅవుట్లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం జోరందుకుంది. గోపాలపట్నం, వేపగుంట, చినముషిడివాడ, పెందుర్తి, సబ్బవరం, కొత్తవలస వరకు భారీ సంఖ్యలో లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. గాజువాక, కూర్మన్నపాలెం, లంకెలపాలెం తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నగర శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం 2 వేల అపార్ట్‌మెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గత రెండు నెలల్లో 500కిపైనే అపార్ట్‌మెంట్లలో గృహ ప్రవేశాలు జరిగాయి. నగర పరిధిలో రోజూ 30 నుంచి 35 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

ప్రోపర్టీ షోలో పాల్గొనే సంస్థలు
ఈ ప్రొపర్టీ షోలో సుమారు 26 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈనాడు ప్రొపర్టీ షోకు ప్రధాన స్పాన్సర్‌ ఎస్‌.బి.ఐ., హ్యాపీహోమ్స్‌, సింగ్‌పూర్‌ సిటీ సహ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. లాన్‌సమ్‌ ప్రోపర్టీ ఎల్‌ఎల్‌పి, వైశాఖీ డెవలపర్స్‌ స్కైలైన్‌, నవ్యా కన్‌స్ట్రక్షన్స్‌, ఎం.వి.వి. బిల్డర్స్‌, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, వైజాగ్‌ ప్రొఫైల్స్‌ గ్రీన్‌ సిటీ, నవరత్న ఎస్టేట్స్‌ – బ్లూమారినో, ది అడ్రస్‌, భూమాత రియల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, నోవూస్‌ కన్‌స్ట్రక్షన్స్‌, పేరమ్‌ గ్రూపు, ఫెడల్గో, హానీ గ్రూపు, హాసిని ఎస్టేట్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, సర్థార్‌ ప్రోజెక్ట్సు ప్రైవేటు లిమిటెడ్‌, ఎ.ఎన్‌.ఆర్‌. ఎస్టేట్స్‌ ఇన్‌ఫ్రాకాన్‌ ప్రోజెక్ట్సు, లక్ష్మీనివాస్‌ హౌసింగ్‌ ప్రోజెక్ట్సు లిమిటెడ్‌, నార్త్‌ స్టార్‌ హోమ్స్‌, శ్రీవైష్ణవి టౌన్‌షిప్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ తదితర సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ మీడియా పార్టనర్‌గా, రేడియో మిర్చి ఎఫ్‌.ఎం. రేడియో పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.