News

Realestate News

సువ్వపాడులో సుందర జలపాతం

vizag real estate news

సువ్వపాడులో సుందర జలపాతం
పర్యటకంగా అభివృద్ధి చేయాలంటున్న గిరిజనులు
హుకుంపేట, న్యూస్‌టుడే
ళీజూళి
మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి జాలువారే ప్రవాహాలు పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. మైదాన ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఎటువైపు ఏ కొండను చూసినా అలరించే జలపాతాలు దర్శనమిస్తున్నాయి. మన్యంలోని ఎతైన కొండలు.. ఆ కొండల మధ్య వాయువేగంతో ప్రవహించే నీటి ధారలు, జలజలజారుతున్న ప్రవాహాలు పర్యటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ సువ్వపాడు గ్రామంలో రెండు ఎతైన కొండల మధ్య నుంచి ప్రవహించే అతి పెద్ద జలపాతం చూస్తే ఎవ్వరైనా వహ్వా అనాల్సిందే. అరకు-పాడేరు ప్రధాన రహదారికి అనుకుని ఉన్న కొట్నాపల్లి గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. దీనిని పర్యటక శాఖ వారు పట్టించుకుని అభివృద్ధి పరిస్తే కొత్తపల్లి, కటికి జలపాలలకంటే సువ్వపాడు జలపాతానికే పర్యటకులు అధికంగా వస్తారని చూసిన ప్రతి ఒక్కరు పేర్కొంటున్నారు.

* జలపాతాన్ని అభివృద్ధి చేయాలి
సువ్వపాడు గ్రామంలో ఉన్న సుందర జలపాతాన్ని అభివృద్ధి చేస్తే గ్రామస్థులతో పాటు పర్యటకులకు మంచి అనుభూతిని అందించవచ్చు. కొట్నాపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతానికి సరైన రహదారి సౌకర్యం లేదు. రహదారి ఏర్పాటు చేస్తే చాపరాయి కంటే అధికంగా పర్యటకుల్ని ఆకర్షిస్తుంది.
– సీదరి విష్ణు, సువ్వపాడు

గిరిజనులకు మార్గం చూపాలి
జలపాతం సమీపంలోని సువ్వపాడు గ్రామ ఆదివాసీ గిరిజనులకు జీవనోపాధి పొందేలా మార్గం చూపాలి. ఎంతో సుందరమైన జలపాతం చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తే గ్రామంతో పాటు గిరిజనులకు కూడా ఉపాధి కలుగుతుంది. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి అన్నివిధాలా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
– కొండమ్మ, సువ్వపాడు