News

Realestate News

సీఎం చేతులమీదుగా నేడు సౌర విద్యుత్‌ ప్లాంటు ప్రారంభం

సీఎం చేతులమీదుగా నేడు సౌర విద్యుత్‌ ప్లాంటు ప్రారంభం
అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: షీలానగర్‌ అనురాధ ఆటో పెట్రోల్‌ బంకులో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్తుప్లాంటును శనివారం సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు బంకు యజమాని వై.వెంకన్నచౌదరి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బీపీసీఎల్‌ బంకులో షీలానగర్‌ వద్ద ఈ ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. రూ. 35 లక్షలతో 30కె.వి ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం నెలకు సుమారు రూ. 1.10 లక్షల విద్యుత్తు బిల్లు కడుతున్నామని, సౌర ప్లాంటుతో సగం అవసరాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణ పరిరక్షణ, వేసవిలో విద్యుత్తు కొరతను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటు ఏర్పాటుచేశామన్నారు.

Source :http://www.eenadu.net/