News

Realestate News

సమష్టి కృషితోనే గాంధీజీ కలలు సాకారం

vizag real estate news

సమష్టి కృషితోనే గాంధీజీ కలలు సాకారం
వీఎస్‌ఈజెడ్‌ కమిషనర్‌ శోభనా కేఎస్‌రావు
సింధియా, న్యూస్‌టుడే : మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేయాలంటే సమష్టి కృషితోనే సాధ్యమని నాలుగు (ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌, పుదుచ్ఛేరి) రాష్ట్రాల వీఎస్‌ఈజెడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శోభనా కేఎస్‌రావు అన్నారు. గురువారం సెజ్‌ ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యమైన సమాజం నిర్మితమవుతుందన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి గాంధీ జయంతి వరకు సెజ్‌ ప్రాంగణంలో ‘స్వచ్ఛ వారోత్సవాలు’ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వీఎస్‌ఈజెడ్‌ జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ జి.త్రినాథరావు, సహాయక కమిషనర్లు ప్రన్నకుమార్‌, శ్రీనివాస్‌, కస్టమ్స్‌ అధికారి నరసింగరావు, ముఖ్య భద్రతా అధికారి సూర్యప్రకాశరావు, సెజ్‌లోని హోబెల్‌బెల్లోస్‌, బయోమ్యాక్స్‌, ఫ్లూయింట్‌ గ్రిడ్‌ వంటి పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.