News

Realestate News

విశాఖ తీరంలో ‘సీ ఫూల్స్’

02-06-2016-002 vizag realestate news

విశాఖ సిటీలో బీచ్ స్నానానికి వెళ్లే యువకులకు ఇకపై చెక్ పడినట్టే! స్విమ్మింగ్ కని వెళ్లి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. ఆ తరహా ప్రమాదాలను అరికట్టేందుకు విశాఖ నగరానికి 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి ఈత కొలనులను (సీ పూల్స్) నిర్మించేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. ప్రయోగాత్మకంగా విశాఖ తీరంలోని మంగమారిపేట, లాసన్స్ బే, రుషికొండ, సాగర‌నగర్ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

దేశంలో ఈ తరహా పూల్స్‌ని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. ఇటువంటివి దక్షిణాఫ్రికా, అమెరికా దేశాలలో షార్క్ ఎటాక్‌కు బయటపడి అక్కడి ప్రభుత్వాలు వీటిని రూపొందించారు. రానురాను ఇవి బాగానే ఫేమస్ అయ్యాయి. వాటి తరహాలోనే వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి నిర్మాణ బాధ్యతను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్- గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులను ఏపీ టూరిజం శాఖ సమకూర్చనుంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో బీచ్‌లో స్విమ్మింగ్‌కి వెళ్లి గడిచిన పదేళ్ళలో 75 మంది మహిళలతోపాటు 465 మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెల్సిందే!