News

Realestate News

విశాఖలో రూ.110 కోట్లతో టూల్‌ రూం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో రూ.110 కోట్లతో 20 ఎకరాల్లో టూల్‌ రూం ఏర్పాటుకు ముందుకొచ్చింది. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌మిశ్రా ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం పరిసరాల్లోని పూడి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఎస్టేట్‌లో 20 ఎకరాల్లో టూల్‌రూం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.110 కోట్లుగా అంచనా వేశారు. ఏప్రిల్‌ 14, 15 తేదీల్లో దీనికి శంకుస్థాపన చేయనున్నారు.

వైజాగ్‌లో నేచురల్‌ హిస్టరీ పార్క్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వైజాగ్‌లో నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియంలను ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకు కేంద్ర భూ, శాస్త్ర మంత్రిత్వశాఖ (ఎర్త్‌ సైన్సెస్‌) ఆమోద ముద్రవేసింది. ఏప్రిల్‌ 1-5 తేదీల మధ్యలో దీనికి శంకుస్థాపన చేయనున్నారు.

Source By: http://www.eenadu.net/