News

Realestate News

విశాఖలో మెగా ట్రేడ్‌ ఫెయిర్‌ సందడి

vizag real estate news

విశాఖలో మెగా ట్రేడ్‌ ఫెయిర్‌ సందడి
దేశ విదేశాలకు చెందిన 500 కంపెనీల ఉత్పత్తులతో కళకళలు
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: విశాఖలో ఏర్పాటు చేసిన మెగా ట్రేడ్‌ఫెయిర్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశ వ్యాప్తంగా ఏడాదికి ఒకసారి నిర్వహించే ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈనెల 23న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మెగా ఫెయిర్‌లో ఎలక్ట్రానిక్స్‌, ఫర్నిచర్‌, ఇంటీరియర్‌ డెకరేషన్స్‌, గృహ వినియోగ వస్తువులు, రియల్‌ ఎస్టేటü, జీవన విధానం, సౌందర్యసాధనాలు, కార్లు, ఆరోగ్యం, వినోదం ఇలా పలు అంశాలకు సంబంధించిన వందలాది వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. అక్టోబరు 3 వరకు ఈ ఫెయిర్‌ జరగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శనను సందర్శించే అవకాశం కల్పించారు.