News

Realestate News

రేపటి నుంచి తిరంగా యాత్ర

vizag news

200 ద్విచక్రవాహనాలపై జాతీయ జెండాతో ర్యాలీ
భాజపా జిల్లా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మీ
చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే:

                   స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 నుంచి వచ్చేనెల 23వ తేదీ వరకూ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా గ్రామీణ జిల్లా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మీ పేర్కొన్నారు. ఆదివారం చోడవరం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ జిల్లాలో 200 ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున భారీగా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అనేక మండలాల కార్యకర్తలు వడ్డాది చేరుకొని అక్కడ నుంచి చోడవరం మీదుగా అనకాపల్లి చేరుకుంటారన్నారు. ఈ ర్యాలీలో ఉత్సాహవంతులైన యువకులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 11న తిరంగ యాత్ర గోడపత్రికను విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో భాజపా మండల శాఖ అధ్యక్షుడు దేవరపల్లి లక్ష్మీనరసింహ (చంటి), ఓబీసీ మోర్చ అధ్యక్షుడు, భర్నికాన కొండబాబు, యువమోర్చ అధ్యక్షుడు ఆరుగొల్లు కొండబాబు, మహిళామోర్చ అధ్యక్షురాలు నంబాళ్ల సరస్వతి, ఉపాధ్యక్షురాలు నీలం శారదా, గొర్లె సన్యాసినాయుడు, నారాయణరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.