News

Realestate News

రూ.429 కోట్లతో అభివృద్ధి పనులు

09-06-2016-001 vizagrealestate news

అనకాపల్లి, న్యూస్‌టుడే: తాము పాలించిన రెండేళ్లలో రూ.429 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాకేంద్రంలో బుధవారం ‘మహాసంకల్పం’ చేపట్టారు. దీనిలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంతవరకు నియోజకవర్గంలో రూ.225 కోట్లు విలువైన పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తలసరి ఆదాయం పెంచుకోవాలని చెప్పారు. పాడి పెంపకం, కూరగాయల సాగు చేపట్టాలని కోరారు. తనను ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియమించారన్నారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటల పెంపుదలకు కృషి చేస్తానన్నారు. డీసీఎంఎస్‌ స్థలంలో ఇండోర్‌ ఆడిటోరియం వుడా నిధులతో నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇప్పటికే ఇంజినీరింగ్‌ అధికారులు సిద్ధం చేశారన్నారు. ఈ సందర్భంగా అందరూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ పురుషోత్తం, జోనల్‌ కమిషనర్‌ సుబాని, అనకాపల్లి, కశింకోట మండలాధ్యక్షులు కొణతాల సావిత్రి, పెంటకోట సుబ్బలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు గంగాభవాని, తహసీల్దార్‌ కృష్ణమూర్తి, మండలాభివృద్ధి అధికారి వెంకటరమణ, మండల ప్రత్యేక అధికారిణి సిరి, ఎన్‌టీఆర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కుమారి, తెలుగుదేశం పార్టీ నేతలు బుద్ద నాగజగదీశ్వరరావు, డాక్టరు కె.నారాయణరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, మలసాల రమణారావు, మళ్ల సురేంద్ర, రొంగలి శ్రీరామమూర్తి, గుత్తా ప్రభాకర్‌ చౌదరి, కాయల మురళి పాల్గొన్నారు.09-06-2016-001 vizagrealestate news