News

Realestate News

రూ.4 కోట్లతో ఆసుపత్రి భవనం


పాడేరులో నేడు ప్రారంభించనున్న వైద్యారోగ్య మంత్రి
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మన్యం ప్రధాన కేంద్రమైన పాడేరులో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏరియా ఆసుపత్రి కొత్త శోభ సంతరించుకోనుంది. రూ.4 కోట్లతో వంద పడకలతో నిర్మించిన కొత్త భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈనెల 26న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనువాస్‌ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రెండేళ్లుగా నిర్మిస్తున్న ఈ భవనాన్ని ప్రధానంగా గర్భిణులకు, సాధారణ వ్యాధులతో ఉన్న రోగులకు ఉండే అవకాశం ఉంది. దంత, కంటి క్షయ తదితర వ్యాధి గ్రస్థులకు సేవలు అందించేందుకు వీలుగా విభాగాలు నిర్మించారు. దీంతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్యులు, సిబ్బంది ఒక చోట కూర్చొనేలా సమావేశ మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రోగులకు విశాలంగా ఉండేందుకు వార్డులో 20 మంది ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. రానున్న రోజుల్లో ఏన్టీఆర్‌ వైద్య సేవలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నేడు మంత్రి పర్యటన
పాడేరు, అరకులోయ: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మంగళవారం పాడేరు, అరుకు మండలాల్లో పర్యటించనున్నట్లు ఏడీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అరకులోయలో సుమారు రూ. 4 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు అరకులోయ వచ్చిన ఆయన ఈ భవన సముదాయాన్ని ప్రారంభించి ఇక్కడి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం విశాఖకు బయలుదేరి వెళ్తారు.

Source  : http://www.eenadu.net/