News

Realestate News

రాజన్నపేటలో నేడు సునామీ మాక్‌ డ్రిల్‌

Elamancililo Rs. Crore development works

విశాఖపట్నం, ఈనాడు: సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాక్‌ డ్రిల్‌లో భాగంగా అచ్యుతాపురం మండలంలోని రాజన్నపేట గ్రామంలో నమూనా ప్రదర్శన ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ మాక్‌ డ్రిల్‌లో అన్నిశాఖలూ పాల్గొంటాయన్నారు. అనకాపల్లి ఆర్డీవో దీన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు.