News

Realestate News

యశ్వంత్‌పూర్‌-విశాఖ-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు

railway new in visakhapatnm

యశ్వంత్‌పూర్‌-విశాఖ-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు

                                       ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం-కొల్లాం-విశాఖపట్నం, యశ్వంత్‌పుర్‌-విశాఖపట్నం-యశ్వంత్‌పూర్‌ మధ్య సువిధ వారంతపు రైళ్లు నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ యల్వేందర్‌ యాదవ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* విశాఖపట్నం-కొల్లాం (82855): ఈ రైలు నవంబరు 19 నుంచి జనవరి 11 వరకూ ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. శుక్ర, సోమవారాల్లో ఉదయం 3.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

* కొల్లాం-విశాఖపట్నం(82856): ఈ రైలు నవంబరు 21 నుంచి జనవరి 13వ తేదీ వరకూ ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.45 గంటలకు కొల్లాంలో బయలుదేరుతుంది. మంగళ, శనివారాల్లో ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది

* ఈ రైలుకు ఒక సెకెండ్‌ ఏసీ, 2 థర్డ్‌ ఏసీ, 7 స్లీపర్‌ క్లాస్‌, 4 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ రెండోతరగతి కమ్‌ లగేజి బోగీలు ఉంటాయి. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జొలారిపెట్‌, సేలం, ఇరోదె, తిరుపూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిశూర్‌, ఎర్నాకులం, కొట్టాయం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

* యశ్వంత్‌పూర్‌-విశాఖపట్నం(06579): ఈ రైలు నవంబరు 4, 11 తేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

* విశాఖపట్నం-యశ్వంత్‌పూర్‌(82664): ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు అక్టోబర్‌ 30, నవంబర్‌ 6, 13 తేదీల్లో మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది.

* ఈ రైలుకు ఒక సెకెండ్‌ ఏసీ, 2 థర్డ్‌ ఏసీ, 6 స్లీపర్‌ క్లాస్‌, 2 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ రెండోతరగతి కమ్‌ లగేజీ, దివ్యాంగుల బోగీలతో ఈ రైలు బాన్సువాడి, కృష్ణరాజపురం, వైట్‌ఫీల్డ్‌, బంగార్‌పెట్‌, కుప్పం, జొలారిపెట్‌, కాట్పాడి, రేణుగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ప్రయాణికులు గమణించి ఈ రైళ్ల సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు