News

Realestate News

మరింత ఆకర్షణీయంగా నగరం

vizag news 2016

స్వచ్ఛ, స్మార్ట్‌ విశాఖ సాధనే లక్ష్యం
జీవీఎంసీ కమిషర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: విశాఖ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా రూపొందించటానికి అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. వివిధ విభాగాలకు నిర్ధేశించిన పనులను సునిశితంగా పరిశీలించి, నిరంతర పర్యవేక్షణతో పూర్తిచేయాలన్నారు. స్వచ్ఛ విశాఖ- స్మార్ట్‌ విశాఖగా రూపొందించడం ద్వారా నగరానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెవటానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారి విస్తరించడం, సెంట్రల్‌ సర్వీస్‌ రహదారుల మధ్య మొక్కల పెంపకం, డివైడర్లకు పెయింటింగ్స్‌ వేయడంతో పాటు మరింత అందం, ఆహ్లాదం ఉట్టిపడేలా చేపడుతున్న పనులను కమిషనర్‌ శుక్రవారం పరిశీలించారు. బహిరంగ మల విసర్జన రహిత నగరంగా విశాఖను ప్రకటించటానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలపై అధికారులతో చర్చించారు. నగరలోని అన్ని జోన్లలో, వార్డుల్లో, జోనల్‌ కమిషనర్ల పర్యవేక్షణలో ఓడీఎఫ్‌ కమిటిలు, ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది శుక్రవారం నిర్వహించిన ర్యాలీపై కమిషనర్‌ అదికారులు అడిగితెలుసుకున్నారు. అనంతరం మద్దిలపాలెంలో గోడలకు వేస్తున్న రంగులు, హనుమంతవాక వద్ద రక్షణ గోడల నిర్మాణం, తదితర పనులను పరిశీలించారు జెడ్సీలు నల్లనయ్య, శివాజీ, ఉద్యానవనశాఖాధికారి దామోదర్‌, అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.