News

Realestate News

భారతరత్న ఆచార్య రావుకు ఘన స్వాగతం

News Vizag

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రసాయనశాస్త్ర పరిశోధకులు, భారతరత్న ఆచార్య సి.ఎన్‌.ఆర్‌.రావుకు విమానాశ్రయంలో శుక్రవారం గీతం వర్సిటీ ప్రొ-వీసీ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్‌ ఎం.పోతరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. గీతంలో శనివారం జరగనున్న 36వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. 2016 సంవత్సరానికి సంబంధించి గీతం ఫౌండేషన్‌ అవార్డును వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి చేతులమీదుగా ఆచార్య రావు అందుకుంటారని ప్రొ-వీసీ శివరామకృష్ణ పేర్కొన్నారు. గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌లోని డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని గీతం వెబ్‌సైట్‌ www.gitam.com ద్వారా వెబ్‌కాస్టింగ్‌ పద్ధతిలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ప్రొ-వీసీ పేర్కొన్నారు.