News

Realestate News

బిల్డర్ల సంఘం కొత్త కార్యవర్గం

10-05-2016-03

బిల్డర్ల సంఘం కొత్త కార్యవర్గం
విశాఖపట్నం, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కారించడంలో బిల్డర్ల సంఘం పాత్ర కీలకమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరువు రామకోటయ్య అన్నారు. సిరిపురం బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరంలో సోమవారం సంఘం విశాఖపట్నం శాఖ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులు(ఛైర్మన్‌)గా జి.వి.రవిరాజు, ఉపాధ్యక్షులుగా ఎ.కాశీవిశ్వేశ్వరరావు, గౌరవ కార్యదర్శిగా ఎ.ఆర్‌.నౌషిద్‌, గౌరవ సంయుక్త కార్యదర్శిగా బి.అవినాష్‌ రెడ్డి, గౌరవ కోశాధికారిగా ఎస్‌.రామ్‌గోపాల్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే చెరువు రామకోటయ్య మూడోసారి రాష్ట్ర అధ్యక్షలు(ఛైర్మన్‌)గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం అసోసియేషన్‌లో 150 మంది సభ్యులున్నారన్నారు.

Source : http://www.eenadu.net/