News

Realestate News

ప్రపంచ వర్సిటీల వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఏయూ క్రీడాకారిణి

vizag real estate news

ప్రపంచ వర్సిటీల వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఏయూ క్రీడాకారిణి

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ప్రపంచ విశ్వవిద్యాలయాల వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఏయూ క్రీడాకారిణి షేక్‌ అలీమా బేగం ఎంపికయ్యారు. ఆమె అఖిలభారత అంతర్‌ వర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచారు. ప్రపంచ స్థాయి పోటీలు నవంబరు 13 నుంచి 17 వరకూ మెక్సికోలో జరగనున్నాయి. ఆమె 69 కిలోల విభాగంలో తలపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రూ. 1.92 లక్షల పారితోషికం అందజేయనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం ఆమెను అభినందించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో ఏయూ ప్రాంతీయ ఇన్‌ఛార్జ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.విజయమోహన్‌, ఎస్‌వీవీపీ వీఎంసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యు.శైలజాలారెన్స్‌, కోచ్‌లు రత్నాకర్‌, జి.ఎస్‌.వర్మ, సారధి తదితరులు పాల్గొన్నారు.