News

Realestate News

ప్రతి ఇంటికి దీపం కనెక్షన్‌ మంజూరు

vizag real estate news

ప్రతి ఇంటికి దీపం కనెక్షన్‌ మంజూరు
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత
సింహాచలం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతి ఇంటికి దీపం కనెక్షన్‌ మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం ఆమె అప్పన్నస్వామిని దర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్యాస్‌ సిలిండ¿ర్లు లేని వారందరికీ 2017 జూన్‌ 2 నాటికల్లా దీపం కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారరన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 25 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. డీలర్లు నష్టపోకుండా ప్రభుత్వం వారికి కమీషన్‌ పెంచడానికి సిద్ధంగా ఉందన్నారు. డీలర్లు అవకతవకలకు పాల్పడితే సస్పెండ్‌ చేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుక, క్రిస్మస్‌ కానుకలు అందజేయడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. తొలుత మంత్రి కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్‌ స్వామి చిత్రపటం అందజేశారు.