News

Realestate News

పోర్టులో అమెరికా బృందం పర్యటన

పోర్టులో అమెరికా బృందం పర్యటన
మహారాణిపేట, న్యూస్‌టుడే : విశాఖపట్నం పోర్టు ట్రస్టు(వీపీటీ)ని మంగళవారం అమెరికా ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా యూఎస్‌ ప్రతినిధి విలయమ్‌ టేలర్‌ పోర్టు ఉప ఛైర్మన్‌ పీఎల్‌ హరనాథ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య స్మార్ట్‌ సిటీ, నీటి కాలుష్య నియంత్రణ, పర్యావరణ నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం పోర్టులో మౌలిక వసతులను తెలుసుకున్నారు.

‘గీతం’ సందర్శించిన… : సాగర్‌నగర్‌: అమెరికా ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు విలియం టేలర్‌ తదితరులు మంగళవారం గీతం వర్సిటీని సందర్శించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.పోతరాజు, ప్రిన్సిపల్‌ కె.లక్ష్మీప్రసాద్‌తో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ విశాఖ నగరం స్మార్ట్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో గీతంతో కలిసి సంయుక్త అధ్యయనాలకు అమెరికా నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ప్రధానంగా విశాఖలో నీటి నిల్వలు, నీటి స్వచ్ఛతా ప్రమాణాలు, పరీక్షలు, వర్షం నీటి సంరక్షణా విధానాలపై గీతంలో భారతశాస్త్రసాంకేతిక విభాగం సహకారంతో జరుగుతున్న పరిశోధనా ప్రాజెక్టులను నిపుణులకు తెలియజేశారు.