News

Realestate News

పేద ప్రజలకు సొంతగూడు.. ప్రభుత్వ లక్ష్యం

government aim of house for poor in vizag

పరవాడ :

పేద ప్రజలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో పరవాడ దరి ఈ భోనంగి రెవెన్యూలో నిర్మించిన గృహనిర్మాణకాలనీని అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దామని, లబ్ధిదారులంతా వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాలనీకి బసవతారక కాలనీగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. కాలనీలో పార్కుతోపాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటు, తాగునీరు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశించామన్నారు. అనంతం ముగ్గురి లబ్ధిదారులకు దుస్తులు అందజేసిన అనంతరం ఇద్దరు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.