News

Realestate News

నగరం వేదికగా టెస్ట్‌మ్యాచ్‌

the city testmyac

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య నవంబరు 17న ప్రారంభం

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖ క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న క్రికెట్‌ టెస్టు మ్యాచ్‌ రానే వచ్చింది. నవంబరు 17 నుంచి 21 వరకూ భారత్‌ జట్టుతో ఇంగ్లండ్‌ తలపడుతుంది. ఇందుకు పోతినమల్లయ్యపాలెంలో వై.ఎస్‌.ఆర్‌. ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ మైదానం వేదికకానుంది. 2005లో భారత్‌-పాకిస్థాన్‌ వన్డే మ్యాచ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ స్టేడియంలో ఇప్పటివరకూ టెస్టు మ్యాచ్‌ తప్ప అన్ని ఫార్మాట్ల పోటీలు జరిగాయి. ఎట్టకేలకు తొలి టెస్టు మ్యాచ్‌ ఇక్కడ జరుగుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇంగ్లండ్‌ జట్టు మన దేశ పర్యటనలో భాగంగా వివిధ వేదికల వద్ద టెస్టులు, వన్డేలు, టి-20లు ఆడనుంది. ఆ జట్టు అయిదు టెస్టులు ఆడనుండగా రెండో టెస్టు మ్యాచ్‌ విశాఖలో జరుగనుంది. కాగా అక్టోబరు 29 న్యూజిలాండ్‌తో భారత జట్లు వన్డేమ్యాచ్‌ కూడా ఇదే వేదికపై ఆడనుంది.