News

Realestate News

తపాలా ద్వారా దుర్గమ్మ కుంకుమార్చన టిక్కెట్లు

Durgamma

తపాలా ద్వారా దుర్గమ్మ కుంకుమార్చన టిక్కెట్లు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ కుంకుమార్చన సేవా టిక్కెట్లు అన్ని తపాలా కార్యాలయాల్లో అమ్మకాలు సాగిస్తున్నామని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.మురళి పేర్కొన్నారు. పట్టణంలో ప్రధాన తపాలా కార్యాలయంలో శనివారం కనకదుర్గమ్మ సేవా టిక్కెట్లు విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లలేని భక్తులకు తపాలా శాఖ, దుర్గామల్లేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో కుంకుమార్చన సేవా టిక్కెట్లు అందుబాటులో ఉంచామన్నారు. పేరు, గోత్రం, ఏ రోజున కుంకుమార్చన సేవ చేయాలో తెలుపుతూ రూ.200 తపాలా కార్యాలయాల్లో చెల్లిస్తే ఆయా రోజుల్లో అమ్మవారికి కుంకుమార్చన సేవ జరిపి వారం రోజుల్లోపు భక్తులకు కుంకుమ, అక్షింతలు, పటిక పలుకులు, అమ్మవారి చిత్రపటం, శక్తి కంకణం పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తామన్నారు. ఇవి సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయని చెప్పారు. డిప్యూటీ పోస్ట్‌మాస్టర్‌ కె.లైకోన్‌, జి.సత్యనారాయణ, కె.దివాకర్‌, అప్పారావు, సాయి, శంకర్‌ పాల్గొన్నారు.