News

Realestate News

చెరకు రైతులకు శుభవార్త!

Elamancililo Rs. Crore development works

చెరకు రైతులకు శుభవార్త!
రూ.4.7కోట్ల కొనుగోలు పన్ను రైతులకే..
అనకాపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో చక్కెర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసిన రైతులకు శుభవార్త. కొనుగోలు పన్నును తిరిగి రైతులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెరకు అభివృద్ధి మండలి సహాయ కమిషనర్‌ జి.వి.వి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులకు వీటికి సంబంధించిన వివరాలు అందజేశారు. దీనివలన జిల్లాలో మూడు కర్మాగారాల పరిధిలోని రైతులకు రూ.4.70 కోట్ల లబ్ధి చేకూరుతుంది. చెరకు గానుగాట చేసే ప్రతి టన్నుకు రూ.60 లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కర్మాగారాలు కొనుగోలు పన్ను రూపంలో చెల్లిస్తాయి. గత కొన్నేళ్లగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బును రైతులకే ప్రోత్సాహకంగా అందిస్తుంది. కర్మాగారాలకు 2015-16 సీజన్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు ఈ డబ్బులు అందిస్తారు. గోవాడ కర్మాగారం పరిధిలో రైతులకు రూ.2.86 కోట్లు, ఏటికొప్పాక రైతులకు రూ.89.13 లక్షలు, తాండవ రైతులకు రూ.94.67 లక్షలు అందుతాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఇది అదనం.