News

Realestate News

కీలక వడ్డీరేట్లు తగ్గించిన ఆర్‌బీఐ

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను తగ్గించినట్లు చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని, రివర్స్‌ రెపో రేటును పావుశాతం పెంచినట్లు వివరించారు. రెపోరేటును ఆర్‌బీఐ 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది. ఎంఎస్‌ఎఫ్‌ రేటును ఆర్‌బీఐ 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. 2016-17లో వృద్ధిరేటు 7.6శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. సీఆర్‌ఆర్‌ రోజువారీ కనీస నిర్వహణను 95శాతం నుంచి 90శాతానికి తగ్గించినట్లు రాజన్‌ వెల్లడించారు.

Source By: http://www.eenadu.net/