News

Realestate News

కాలుష్యాన్ని పీల్చుకునే చెట్లు

Particular plants should be planted which control air pollution in vizag news picture

నగరంలో కొన్ని చెట్లు కాలుష్యం వల్ల నిర్జీవంగా మారడాన్ని పరిశోధన ద్వారా గుర్తించా. సుమారు 15 చెట్లపై మూడేళ్ల పాటు జరిపిన అధ్యయనాల ఫలితంగా కొన్ని చెట్లను పెంచడం వల్ల కాలుష్యాన్ని తగ్గించొచ్చని తేలింది. ప్రధానంగా బాదం, కానుగ, మామిడి, వేప తదితర చెట్లల్లో 75 శాతం కార్బన్‌ ఉన్నట్లుగా గుర్తించాం. విశాఖ నగరంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ మొక్కలను ఎంచుకుని వాటిలో ఏ మేరకు కార్భన్‌ నిక్షిప్తం అవుతుందో పరిశోదన చేశా. ఆకులు తీసి పత్రహరితాన్ని అధ్యయనం చేయడంతో పాటు కణ జాలాలను పరీక్షించగా వాటిలో కార్బన్‌శాతం ఎక్కుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వాహనాల రద్దీ ఉన్న చోట్ల, పరిశ్రమల సమీపంలో కాలుష్యాన్ని తగ్గించే లక్షణాలున్న బాదం, కానుగ, వేప, మామిడి మొక్కలు నాటాల్సిన ఆవశ్యతకను నివేదిక రూపంలో జిల్లా యంత్రాంగానికి అందించాం.