News

Realestate News

కన్నుల పండువగా శ్రీత్రిపురాంతక స్వామి కల్యాణం

Vizag Real Estate News

కశింకోట న్యూస్‌టుడే: సర్వమంగళాంబ సమేత త్రిపురాంతక స్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక కుంకు మార్చనలు జరిపారు. ఆలయ అర్చకుడు వెలవలపల్లి సూర్యశంకరం ఆధ్వర్యంలో వేదపండితులు గణపతిపూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ, ధ్వజరోహణ నిర్వహించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని పెండ్లికుమారుడు, పెళ్లికుమార్తెగా అలంకరించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులు ఉంచి శైవాగమశాస్త్రప్రకారం కన్నులపండువలా కల్యాణోత్సవం నిర్వహించారు. అధికసంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చి కనులారా కల్యాణాన్ని తిలకించారు.

Source : http://www.eenadu.net/