News

Realestate News

ఇక నౌకల సురక్షిత సముద్రయానం

News in Port

వీపీటీ ఆధ్వర్యంలో వీటీఎంఎస్‌ విధానం అమలు

మహారాణిపేట, న్యూస్‌టుడే: విశాఖపట్నం పోర్టు ఆధునికీకరణలో భాగంగా నౌకల రాకపోకల సమాచారం పక్కాగా తెలుసుకునేందుకు వెసల్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(వీటీఎంఎస్‌) ప్రవేశపెట్టింది. దీనిని మంగళవారం పోర్టు సిగ్నలింగ్‌ ప్రాంతమైన ఫిషింగ్‌ హార్బర్‌ దరిలో పోర్టు ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఉప ఛైర్మన్‌ పీఎల్‌ హరనాథ్‌లు ప్రారంభించారు. ముంబాయికు చెందిన ఎల్‌కమ్‌ ఇంటిగ్రేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని రూ.1.75 కోట్ల వ్యయంతో దీనిని ప్రవేశపెట్టారు. ఈ విధానం వల్ల సముద్రంలోని 20 నాటికల్‌ మైళ్ల వరకు నౌకల రాకపోకల వివరాలు తెలుసుకోవచ్చు. ఏఐఎస్‌, రాడార్‌, వీఐటీఎఫ్‌, సీసీటీవీ తదితర అత్యాధునిక నిఘా పరికరాలతో నౌకల రాకపోకలపై పటిష్ట నిఘా వ్యవస్థకు అవకాశం ఏర్పడినట్లయింది. అలాగే సురక్షిత సముద్రయానం, సముద్రం నుంచి పోర్టు ప్రవేశమార్గం, పోర్టు ప్రాంతం, ఎస్‌బీఎం ప్రాంతం, బెర్త్‌ంగ్‌ తదితర ప్రాంతాల్లో నౌకల ట్రాఫిక్‌ను అంచనా వేయవచ్చు. దీని వల్ల పోర్టు వ్యాపార, భద్రత సామర్థ్యం పెరగనుంది.