News

Realestate News

హౌరా, ఎర్నాకులం, చెన్నైలకు ప్రత్యేక రైళ్లు

Real Estate News

ఈనాడు – విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హౌరా-ఎర్నాకులం, హౌరా-చెన్నైల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం యెల్వేందర్‌యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హౌరా-ఎర్నాకులం వెళ్లే ప్రత్యేక సువిధా రైలు ప్రతీ ఆదివారం ఉదయం 6.45గంటలకు విశాఖకు వస్తుందని, తిరుగు ప్రయాణంలో ప్రతీ బుధవారం ఉదయం 8.25 గంటలకు విశాఖ మీదుగా వెళ్తుందని చెప్పారు. అలాగే హౌరా నుంచి చెన్నై వెళ్లే ఏసీ సూపర్‌ఫాస్ట్‌ ప్రతీ ఆదివారం తెల్లవారుజామున (శనివారం అర్థరాత్రి దాటాక) 2.05గంటలకు విశాఖ మీదుగా వెళ్తుందని, తిరుగు ప్రయాణంలో ప్రతీ సోమవారం ఉదయం 5.15 గంటలకు విశాఖకు వస్తుందని వివరించారు. ఈ రెండు రైళ్లు నవంబరు వరకు కొనసాగుతాయని తెలిపారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo